సాక్షి డిజిటల్ న్యూస్: నాగర్ కర్నూలు జిల్లా /బిజినపల్లి మండలం ;తేదీ :13 జనవరి (రిపోర్టర్ కొంకలి మధుసూదన్): యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్ఠను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అని తెలంగాణ ప్రాంత సేవ ప్రముఖ శివశంకర్ తెలిపారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర పాలెం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ లో పాల్గొని ఆయన సందేశాన్ని స్వయం సేవ కులకు ఈ విధంగా తెలియజేశారు. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, దానిలోపల వజ్రాయుధంతో తయారైన మనస్సు, పౌరుషం, క్షాత్రవీర్యం, బ్రహ్మతేజస్సు కలిగిన యువత నాకు కావాలంటూ’ యువతరానికి సందేశాన్ని ఇచ్చాడని,మన వేదమంత్రాలలో ఉండే అమోఘ శక్తి వల్ల యువతను మేల్కొల్పుతాను. లేవండి! మేల్కొనండి!’ అని యువ భారతానికి దిశా నిర్దేశం చేశాడు. వివేకానందుడి సందేశం అందిపుచ్చుకుందాం. ఉక్కు సంకల్పంతో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుందాం. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానవత్వ పరిమళాల్ని సమ్మిళితం చేసి కొత్త చరిత్రను సృష్టిద్దాం.. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత ,పాలెం స్వయం అందరూ పాల్గొన్నారు.