ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

★మరికల్ యువక మండలి ఆధ్వర్యంలో….. ★మరికల్ గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులకు ఘన సన్మానం….

సాక్షి,డిజిటల్ న్యూస్, మరికల్,జనవరి 13,( గాజుల ఇమామ్ ), మరికల్ మండల కేంద్రంలోని యువకమండలి ఆధ్వర్యంలో సోమవారం నాడు స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువక మండలి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతలో దేశభక్తి, స్వామి వివేకానంద స్ఫూర్తిలను స్మరించాలన్నారు. కార్యక్రమంలో మరికల్ ఎస్సై రాములు మాట్లాడుతూ స్వామి వివేకానంద అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. అనంతరం మరికల్ గ్రామ యువకుమండలి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచుకు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య, నాయకులు మరికల్ గ్రామ వార్డు సభ్యులు మరికల్ యువత యువకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.