సాక్షి డిజిటల్ న్యూస్ తేది-13-01-2026. గ్రామం-మస్కాపూర్, మండలం- ఖానాపూర్, జిల్లా-నిర్మల్.
రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో వడ్డెర సంఘ నాయకులు ఆదివారం 11వ తేదిన వడ్డెర ఓబన్న ప్రథమ స్వతంత్ర సమరయోధులు జయంతి ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అల్లేపు వెంకటేష్ పీటర్ ఉమ్మడి జిల్లా అద్యక్షులు, జిల్లా అద్యక్షులు పసుపుల శ్రీనివాసులు, ఎంఏ వకీల్ ఎన్ హెచ్ అర్సి నాయకులు ఖానాపూర్ లో ఏర్పాటుచేసిన జయంతి లో పాల్గొని, ఈ సందర్భంగా వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర కుల సంఘ నాయకులు ఉమ్మడి జిల్లా అద్యక్షులు అల్లేపు పీటర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ వడ్డెర సంఘం జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ దండవుల రాజయ్య, సోన్ మండలం అద్యక్షులు గారంగుల నరేష్, వేముల నరసింహులు ,ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అల్లేపు పీటర్, జిల్లా కమిటీ సభ్యులు బండపెల్లి సురేష్, అంత్రం మధు, మహిళ సంఘ నాయకులు పి. స్వరూప, కమల, మధు పాల్గొన్నారు.