సాక్షి డిజిటల్ న్యూస్: 13 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొని, వివేకానందుడి చిత్రపటానికి నివాళులర్పించారు. స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన బాటలో నడిచి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ, లక్ష్య సాధన కోసం కృషి చేయడమే.. మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.