క్యారం బోర్డు టోర్నమెంట్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ పరిధిలోని ఫార్మర్స్ బ్రిడ్జ్ వ్యవస్థాపకుడు ఎగుర్ల గణేష్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో క్యారం బోర్డ్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మాట్లాడుతూ… గ్రామంలోని యువకులు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడలు దోహదం చేస్తాయని, గ్రామంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ సంతోష్, మాజీ ఉపసర్పంచ్ లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్, అనుమల్ల అజయ్ ప్రారంభించగా, మొదటి బహుమతి పొందిన జగదీష్,పవన్, రెండవ బహుమతి పొందిన గుర్రం కిషన్, నవీన్ కి మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. లింగా రెడ్డి మాట్లాడుతూ… ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎగుర్ల గణేష్ ను అభినందించారు.