కోలాహలంగా డ్రాగన్ పడవల పోటీలు ప్రారంభం…

★పడవల పోటీలతో కోనసీమ వైభవం విశ్వవ్యాప్తం… ★జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 ఆత్రేయపురం మండల రిపోర్టర్ (టీ.వీ. కృష్ణారెడ్డి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామం డ్రాగన్ పడవల పోటీలతో కోనసీమ వైభవం విశ్వవ్యాప్తం కానున్నదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు లో భాగంగా రెండవరోజైన సోమవారం డ్రాగన్ పడవల పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రేక్షకుల కోలాహలం మధ్య పడవల పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. కేరళలో సాంప్రదాయకంగా జరిగే పడవలపోటీలు మన కోనసీమలో సైతం నిర్వహించుకోవడం ద్వారా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయన్నారు. భవిష్యత్తులో కేరళ తరహాలో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.