సాక్షి డిజిటల్ న్యూస్ : మునుగోడు రిపోర్టర్ : (సునీల్ సులేమాన్) మునుగోడు మండల కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలంలోని 90 మంది లబ్ధిదారులకు 24,52,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశానుసారం పంపిణీ చేశారు మునుగోడు మండల స్థానిక నాయకులు. మునుగోడు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నుండి వచ్చిన లబ్ధిదారులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను తీసుకున్నారు. ఆయా గ్రామాల లబ్ధిదారులకు స్థానిక మండల నాయకులతో పాటు నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెక్కులను అందజేశారు. ఓ వైపు అభివృద్ధి మరో వైపు తమ మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంత ఖర్చు తో సామాజిక కార్యక్రమాలు చేస్తూ మునుగోడు నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్న మన రాజన్నకు త్వరలోనే మంత్రి పదవి రాబోతుందని మునుగోడు నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నా యని అన్నారు. నల్గొండ డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటి కప్పుడు సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక స్టాఫ్ ని నియమించి సేవలందిస్తున్నారని, కరోనా కష్ట సమయంలో 7 కోట్ల రూపాయల నిత్యావసర సరుకుల పంపిణి చేసి నిరుపేదల ఆకలి తీర్చిన ఘనత రాజ్ గోపాల్ రెడ్డిది అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టు ఉన్న వారికి సీఎంఆర్ ఎఫ్ పై అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నల్గొండ డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, మునుగోడు మండల ముఖ్య నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
