కొడిమ్యాలలో స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా 163 వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు స్వామి వివేకానంద విగ్రహం దగ్గర కొబ్బరికాయలు కొట్టి, పూలమాలలు వేసి జయంతి వేడుకలు ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వల చేసి వందేమాతరం గీతాలాపనతో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన వారు మాట్లాడుతూ…. యువకులు స్వామి వివేకానంద మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాల నుండి విముక్తి పొంది మంచి నడవడిలో వెళ్లాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, అల్పోర్స్ విద్యా సంస్థల అధినేత ఊట్కూరి నరేందర్ రెడ్డి,జిన్నా సత్యనారాయణ రెడ్డి, బృందావనం రిసార్ట్ అధినేత కొండలరావు,ఎంపీడీవో స్వరూప,వివేకానంద సేవా సమితి అధ్యక్షులు కంచర్ల గంగాచారి, సేవా సమితి సభ్యులు మంచాల శ్రీనివాస్, నాంపల్లి రామచంద్రo,ఏనుగు ఆదిరెడ్డి,వడ్లకొండ హనుమాన్లు,బొమ్మ సురేష్, చేన్న దేవేందర్,భూస గంగాధర్,ఎర్రోజు శ్రీధర్, బుచ్చిరాములు, అడ్లగట్ల రమేష్ ,చుక్క శ్రీనివాస్ బల్ల అంజయ్య, శ్రీనివాసాచారి,తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.