ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల తెలుగుదేశం సన్నాహక సమావేశం.

★కొండ బాల కరుణాకర్. (తెలుగుదేశం పార్టీ పాలేరు కన్వీనర్)

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 12 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న.) తెలుగుదేశం పార్టీ ఏదులాపురం మున్సి పాలిటీ శాఖ సమావేశం దివంగత నేత సానబోయిన శ్రీనివాస్ గోపి హోటల్ లో జరిగినది. ఈ సమావేశానికి పాలేరు నియోజక వర్గ భాద్యులు కొండబాల కరుణాకర్, లీగల్ సెల్ నాయకులు మల్లెంపాటి అప్పారావు హాజరై డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులకు దిశా నిర్దేశం చేసారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కలసి వచ్చే పార్టీలతో కలసి పోటీచేస్తామని లేదా అన్ని వార్డ్ లలో పోటీ చేస్తామని వారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు అలాగే జాతీయ అధ్యక్షులు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, యవనాయకులు లోకేష్ బాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలకు వివరించారు. మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్ధులు గెలుస్తారని వారు దీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పలసం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంపటి సుధాకర్, నాయకులు నల్లమోతు సత్య నారాయణ, సానబోయిన గోపి, మల్లెంపాటి లహరిన్ , నాగండ్లప్రసాద్, గున్నాల వెంకటేశ్వర్లు, పెరుగు లింగయ్య, తేనే సహదేవు, తేనే గోవిందు, వల్లెబోయిన వెంకటరమణ, కొత్తపల్లి గోపి, తుమ్మల నగేష్, దరావత్ సైదులు, అర్వపల్లి రాజు, సిహెచ్ జయప్రకాష్, బొల్లేపల్లి దుర్గాప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.