ఎమ్మెల్యే పద్మావతి తన అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికే ప్రతిపక్షాలపై విమర్శలు ..

*గ్రీన్ ట్రిబ్యునల్ బాధితుల విషయంలో ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి … * మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 12 2026, అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్ చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ పేరు మీద కోదాడ చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో నివసించే 372 పేద కుటుంబాలకు గత 15 రోజుల క్రితం నోటీసులు వచ్చిన విషయం తెలిసిందేనని, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై విమర్శలకు దిగుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నోటీసులు వచ్చి 15 రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్, బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్నారే కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురవుతూ, ఆందోళన చెందుతున్న బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించడానికి తీరిక దొరకలేదు.ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా మేము స్పందిస్తే కానీ మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకి అండగా ఉండాలని ఉద్దేశంతో వారిలో భరోసా నింపాలని ఆ కుటుంబాలను స్వయంగా కలిసి ధైర్యాన్నిస్తుంటే మా మీద స్థానిక ఎమ్మెల్యే విమర్శలు దిగడం విడ్డూరంగా ఉంది. బోడ గుండు కి బొటన వేలుకు పొంతన పెట్టినట్టు కోర్టు నుండి నోటీసులు వస్తే అదేదో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టు మైకులు పట్టుకుని ఊకదంపడు ఉపన్యాసాలు ఇస్తున్న ఎమ్మెల్యే కి ఇన్ని రోజులు పాలన మీదనే అవగాహన లేదనుకున్నాం కానీ న్యాయవ్యవస్థ మీద కూడా అవగాహన లేదని ఇప్పుడు అర్థమవుతుంది. కోదాడ పట్టణ చెరువు విషయంలో చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా కేసును స్వీకరించిందని, అట్టి కేసుకు సంబంధించిన నోటీసులని ప్రభుత్వాధికారులైన రెవిన్యూ అధికారులు బాధితులకు అందజేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గుర్తుంచు కోవాల్సిన విషయం ఏమిటంటే చెన్నై కోర్టులో ఎవరు కేసు వేయలేదని అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదని అలాంటి దానికి ప్రతిపక్షాలకు ఏమి సంబంధమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెవిన్యూ అధికారుల చేత మేము నోటీసులు ఇపిచ్చామని మీరు భావిస్తే అది మీ అసమర్ధతనా లేక మా సమర్థతనా అని మీరే ఆలోచించుకోవాలని ప్రశ్నించారు. అధికారంలో ఉండి నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా నియోజకవర్గ ప్రజలు బాధలు వినకుండా నోటీసులు ఎప్పుడు వచ్చాయో ఎక్కడి నుంచి వచ్ఛాయో ఎవరు ఇచ్చారు తెలవకుండా ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. మిమ్మల్ని హైదరాబాద్, బెంగళూరు లో విశ్రాంతి తీసుకోవడానికి కోదాడ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించలేదనే విషయాన్ని గుర్తుంచు కోవాలని, మీ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై విరుచుకుపడడం సమంజసం కాదని, ఆందోళన చెందుతున్న కుటుంబాలకు సరైన రీతిలో న్యాయం చెప్తే బాగుంటుందని ఆయన ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ లో జరుగుతున్న ఈ కేసు విషయంలో కోదాడ రెవిన్యూ అధికారులు బాధితుల పక్షాన వేసిన సమాధానoను బహిర్గతం చేయాలని అప్పుడు ఈ విషయంలో ఎవరు దాగుడు మూతలు ఆడుతాన్నారనే విషయం బయటకి వస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *