సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి.13, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వార్డ్ 3 మడ్ఫోర్డ్ లోని ప్రభుత్వ పాఠశాల లో వార్డ్ నాయకుల ఆధ్వర్యంలో రంగోలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ గారు పాల్గొనటం జరిగింది .ఈ కార్యక్రమంలో చిన్నారుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు బి ఎన్ శ్రీనివాస్ గారు,3వ వార్డ్ బిజెపి అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, భాగ్యలక్ష్మమ్మ, వినోద, అనురాధ, రేఖా, విజయలక్ష్మి, హరికృష్ణ ,ప్రవీణ్, నరేష్ గార్లు మరియు తదితర చుట్టూ పక్కల కాలనీ బస్తీ వాసులు కూడా పాల్గొనటం జరిగింది.