సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ సంజీవ్ జనవరి13 అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం. పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక ఎస్సై సురేష్ మాట్లాడుతూ రౌడీ సీటర్లు సస్పెక్ట్లను రానున్న సంక్రాంతి సందర్భంగా ఇదివరకు కోడిపందాలు పేకాట వంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులను స్టేషన్ వద్దకు పిలిచి వారిని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు సంక్రాంతి సందర్భంగా ఎవరైనా జూదం(పేకాట, కోడిపందాలు, గుండాట) నిర్వహించినట్లయితే వారి పైన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుందని అటువంటి వ్యక్తులను ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక మండల ఎగ్జిక్యూటివ్ మాస్టర్ వద్ద మంచి ప్రవర్తన నిమిత్తం బైండోవర్ జరుగుతుందని హెచ్చరించారు.