సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్ జన్నారం మండలంలోని కళామతల్లి సాంస్కృతిక కళ రచయితలు గాయకులు మానవతావాదులు అలిశెట్టి ప్రభాకర్ ఘనతను కొనియాడుతూ 12 జనవరి 1954న జన్మించి 12 జనవరి 1993 రోజున తుది శ్వాస కలం చేత పట్టి నిప్పు రవ్వల కనికలపై తారాజువ్వల దివిటి కన్నులతో ఎన్నో రచనలు చేసిన వ్యక్తి మన అలిశెట్టి ప్రభాకర్ అన్నారు వేశ్య జీవిత వర్ణనను అభివర్ణించడంలో ప్రపంచంలో ఏ కవి ఇక పుట్టలేదు. తను ఒక్కపండునై మరొకరికి విందునై వేశ్య జీవితాన్ని అభివర్ణించిన మహాతి మహా మానవ అంతరాల్లోకి వెళ్లిన అభినవ సృజనాత్మక మానవతావాదిగా చేసిన రచనలు కోకొల్లలు సినీ గేయ రచన సినిమా టేకులు నిత్యజీవితంలో కళ్ళకు కట్టినట్లుగా రచించిన రచయిత తను ఒక పుండై మరొకరికి విందై అనే సంబోధన మానవత్వం కలిగిన వ్యక్తులకు కన్నీటి దార సముద్రంగా గుర్తుండిపోయే పద వ్యాకరణం చేసిన మహాను భావుడు వర్ధంతి జయంతి ఒకే రోజు జరుపుకోవడం అలిశెట్టి ప్రభాకర్ కె వర్తించింది అని వక్తలు తెలిపారు.