సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి:13, వేములవాడ ఆర్. సి. ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బూర్ల రాజయ్య తండ్రి నర్సయ్య వయస్సు 45 ఏండ్లు అనారోగ్యంతో మృతి చెందగా,ఈ రోజు రాజయ్య స్వాగ్రామంలోని నివాసానికి వెళ్లి అతని కుటుంబానికి 5,000 రూపాయలు నగదు,50 కిలోల బియ్యాన్ని హమాలీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గజ్జెల శేఖర్,హమాలీ సంఘ నేతలు గంగాధర రాజ్ కుమార్, గురగల్ల శ్రీనివాస్,చంద్రగిరి బాబు,గురగల్ల రాజయ్య,చంద్రగిరి శ్రీను,లింగంపల్లి ప్రవీన్లు సహాయాన్ని అందజేశారు. హమాలీ కార్మికుడు బూర్ల రాజయ్య మృతి పట్ల మండల హమాలీ సంఘం గౌరవ అధ్యక్షులు పొలాస నరేందర్,మండల ప్రధాన కార్యదర్శి గుండం బాలయ్య,పిట్టల లచ్చయ్య,స్వామి తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద హమాలీ బూర రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సంఘ గౌరవ అధ్యక్షులు పొలాస నరేందర్ ప్రభుత్వాన్ని,మండల అధికారులను కోరారు.