సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) అచ్చంపేట పట్టణంలో సోమవారం జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నికల్లో అచ్చంపేట తాలూకా సంఘం అధ్యక్షునిగా గాలిగూటి జగదీష్ ఎన్నికయ్యారు తాలూకాలో దాదాపు 500 వందలకు పైగా ఓటర్లు ఉండగా 337 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఎన్నికల అధికారులుగా వి సాయిలు మరియు యం ప్రభాకర్ లు వ్యవహరించారు ముగ్గురు అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ చేయగా 171 ఓట్లతో గాలిగూటి జగదీష్ విజయం సాధించారు ఈసందర్భంగా జగదీష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన తోటి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు తాలూకా లో భవన కార్మికుల సంక్షేమం మరియు హక్కుల కోసం నిరంతరం పోరాడుతానన్నారు అనంతరం ఆయన్ను పలువురు శాలువాతో సన్మానించారు.