సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి:13 వేములవాడ ఆర్. సి.ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… నా మరణం చివరి చరణం కాదని సగర్వంగా ప్రకటించిన అక్షర యోధుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్థంతి సందర్భంగా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లిలో అలిశెట్టి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “కష్టజీవి బతుకును సిరాలో నింపి అక్షరాలతో అగ్గి పుట్టించినోడు, కలంతో కవాతు చేసినోడు అలిశెట్టి ప్రభాకర్ అని, పెన్సిల్ తో బొమ్మలేసినా, పెన్నుతోకవిత్వం రాసినా అది ప్రజాపక్షమే, పాలకులను ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం, సుత్తి లేకుండా సూటిగా చెప్పడం అలిశెట్టి ప్రభాకర్ మాదిరి మరొకరికి సాధ్యం కాదేమో అని, అలిశెట్టి ప్రభాకర్ నేటి జగిత్యాల జిల్లా పట్టణంలో 1956 జనవరి 12న జన్మించాడని, అలిశెట్టికి ఏడుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడని, తండ్రి మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించాడని, ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలైన ‘భాగ్యం’ ను పెళ్లి చేసుకున్నాడని, జీవిక కోసమే తప్పా, ఏనాడు సంపాదన కొరకు ఆరాటపడని మనిషి అని, తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడని, చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్ గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే కవిగా ఎదిగారని, 1982 లో హైదరాబాద్ లో స్థిరపడ్డారని, ఆంధ్రజ్యోతి దినపత్రిక లో ఆరేళ్ల పాటు సీరియల్ గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరం పై మినీ కవిత్వం రాశాడని, తన కవిత్వం తో పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడిని, కవిత్వాన్ని రాస్తూనే 1993 జనవరి 12న కన్నుమూశారని, 1954 జనవరి 12 న పుట్టి, 1993 అదే తేదీ నాడు మరణించిన అలిశెట్టి బతికింది 39 ఏళ్ళే అని, 19 వ ఏట కలం పట్టిన ఆయన మీద 20 ఏళ్ల పాటు కవిత్వమే జీవిత పరమార్ధంగా గడిపారని, చివరి పదేళ్ల కాలంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో గడిపాడని, ఆరోగ్యం దెబ్బతిని, ఆస్తులు కరిగిపోయాయాయని, ఇవేమీ ఆయన రచనా సంకల్పాన్ని చెదరగొట్టలేదని, కష్టాలు ఆయన కవిత్వాన్ని మరింత రాటుదేల్చాయని, తన జీవన కాంక్షను, బతుకు ఆటుపోట్లను కవిత్వంలో బలంగా చెప్పడం ద్వారా ఆయన అక్షరాలు పాఠకుల హృదయాలను సూటిగా తాకాయని, మేఘ సందేశం, గబ్బిలం కావ్యాల్లో కవులు ఒక మాధ్యమం ద్వారా తమ వేదనను వ్యక్తపరిచినట్లు అలిశెట్టి తన కష్టాలను, బాధను, అనారోగ్య పీడనను, ఆర్థిక ఇక్కట్లను మనుషులతో కాకుండా కవిత్వంతో చెప్పుకున్నాడని, చివరి క్షణం వరకు కవిత్వాన్ని ఆశ్రయించారని, అలిశెట్టి రాసుకు న్నట్లే ఆయన మరణం చివరి చరణం కాలేదని ” పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలిశెట్టి రామచంద్రం, మహమ్మద్ సలీం, దాచారం నాగరాజు,గుడిసె మనోజ్, చందనం శ్రీనివాస్,పొన్నాల శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
