సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి అరుణ. 11.01.2026 నాడు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి ఔటర్ రింగ్ రోడ్ మార్గంగా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పటాన్చెరు పోలీస్ స్టేషన్ మరియు ఎస్.ఓ.టి సిబ్బంది ఎన్. డి. పి.ఎస్ చట్టం ప్రకారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం సుమారు 4:45 గంటలకు ముత్తంగి టోల్ ప్లాజా సమీపంలో అనుమాన స్పదగా ఉన్న రెండు వాహనాలను పోలీసులు అడ్డుకొని తనిఖీ చేశారు వాటిలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన భారత్ బెంజ్ డీసీఎం వాహనం(MH-13-AX-3771) మరియు ఐ20 కారు (MH-13-CS-6756) వాహనాలను తనిఖీ చేయడంతో 19 ప్యాకెట్ల ఎండు గంజాయి మొత్తం 92 కిలోలు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు రెండు కోట్ల 46 లక్షలు గా అంచనా వేయబడింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులు సచిన్ గంగారం మారుతి చావన్ వయసు 36 మహేష్ రవీంద్ర వడ్కర్ వయసు 43 విజయ్ చావన్ వయసు 30 మోర్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారని ముగ్గురు నిందితులను సోలాపూర్ జిల్లా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించి అరెస్టు చేశారు విచారణలో నిందితులు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి గంజాయిని సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వెల్లడైంది అక్రమ రవాణాకు ఉపయోగించిన రెండు వాహనాలతో పాటు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశాలోని పరాలాకే ముడి ప్రాంతానికి చెందిన జాఫర్ అనే వ్యక్తి సరఫరా చేస్తుండగా మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన అజిత్ జనకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో వెళ్లడైంది. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పటాన్చెరు పోలీస్ సిబ్బంది ఎస్ఓటి బృందాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించడం జరిగింది.
