సాక్షి డిజిటల్ న్యూస్ 09 జనవరి 26 జమ్మికుంట టౌన్ రిపోర్టర్, ఇల్లంతకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన యువ నాయకుడు, ఎన్ఆర్ఐ సరిగోమ్ముల హరిప్రసాద్ సేవా భావంతో ముందుకు సాగుతూ గ్రామ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. విదేశాల్లో స్థిరపడినా, తన మట్టి మీద ప్రేమను మరచి పోకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలోని నిరుపేద కుటుంబాలు, నిరుద్యోగ యువతకు భరోసాగా నిలుస్తూ, పేద విద్యార్థులకు సైకిళ్లు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసి వారి చదువుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్న పేద కుటుంబాలకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వానికి అర్థం చెబుతున్నారు.
గ్రామాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న హరిప్రసాద్‌ను గ్రామ ప్రజలు ప్రశంసిస్తున్నారు. మాటలకే పరిమితం కాకుండా చేతలతో సేవ చేస్తున్న యువ నాయకుడిగా హరిప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.
