సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి.9, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. సంక్రాంతి పండుగ సందర్భంగా బి.కొత్తకోట మండలంలోని చుట్టు పక్కల ప్రాంతంలలో కోడిపందేలు.పేకాట నిర్వహిస్తే చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గోపాల్ రెడ్డి హెచ్చరించారు.ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ కోడి పందాలు పేకాట ఆడడం చట్టరీత్యా నేరమని నింబంధనలు ఉల్లంకిస్తే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 10జంతు హింస నివారణ చట్టం 1960 లోని సెక్షన్ 34 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు, చిన్న పిల్లలు గాలిపటాలు ఇళ్ల మధ్యలో కానీ ఇంటి పైకి ఎక్కి గాని రహదారుల వద్ద కానీ గాలిపటాలు ఎగుర వేయరాదని గాలిపటాలకు ప్రమాదకరమైన దారాలు ఉపయోగించరాదని, చిన్నపిల్లలు పెద్దల సమక్షంలో ఖాళీ ప్రదేశమైన గ్రౌండ్లలో ఎగురవేయాలని, భోగి మంటలు వెలిగించేటప్పుడు ప్రమాదకరమైన టైర్లు ప్లాస్టిక్ వస్తువులతో వెలిగించరాదని భోగిమంటలకు చిన్న పిల్లలు దూరంగా ఉండాలని, పై నిబంధనలు పాటించని అట్టివారిపై చట్టపర చర్యలు తీసుకోబడునని సంక్రాంతి పండుగ మీ కుటుంబ సభ్యులతో పాటు భద్రతతో కూడిన పండుగ జరుపుకోవడం అందరికీ ఆనందం.. ఆహ్లాదకరం…అని సి ఐ గోపాల్ రెడ్డి ముందుగా బి. కొత్తకోట మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.