సాక్షి డిజిటల్ న్యూస్:జనవరి 9, నంద్యాల జిల్లా,శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలోని అన్నపూర్ణ భవనం నందు భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణకు ఎంఎల్ఎన్ రవీంద్ర కుమార్,అనంతపురం వాస్తవులు గురువారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ.1,00,001/-లను అందజేశారు.ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేయడం జరిగింది.దాతకు తగు రశీదు, ప్రసాదాలు,శేషవస్త్రం అందజేయబడ్డాయి.అనంతరం దాత శ్రీస్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.