“విలాసోత్సవం’ కార్యక్రమం.

*అధికారులకు, గ్రామ పెద్దలకు ఆహ్వానం *హరిచంద్ర నాయక్, *గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 9 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రాముల వారికి జరిగే, అనేక రకములైన ఉత్సవాలలో, అధ్యయనోత్సవములు చాలా ముఖ్యమైనవి. శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 24 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు, ప్రధానంగా మూడు విధాలు, వైకుంఠ ఏకాదశికి ముందు, పది రోజులపాటు పగల్పత్ గాను, తర్వాత పది రోజులు రాపత్తుగాను, చివరి మూడు రోజులు “, విలాస ఉత్సవం” గాను జరుగుతాయి . ఈ అధ్యయనోత్సవాలలో చివరి సేవగా జరిగే ఈ విలాసోత్సవాన్ని గత ఆరు సంవత్సరాలుగా హరిచంద్ర నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అట్లనే ఈ సంవత్సరం కూడా 10-01-2026 న పురుషోత్తపట్నం గ్రామంలో సెయింట్ ఆన్స్ స్కూల్ పక్కనే ఉన్నటువంటి శ్రీ గోకులరామంలో ఈ విలాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎటపాక మండల అధికారులైన ఎమ్మార్వో, ఎంపీడీవో , సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లకు మరియు, పురుషోత్తపట్నం లోని గ్రామ పెద్దలకు ఆహ్వాన పత్రికను హరిచంద్ర నాయక్, మరియు గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకట రామిరెడ్డి అందజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *