రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యతజిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

సాక్షి డిజిటల్ న్యూస్ 9 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2026 బైక్ ర్యాలీ కార్యక్రమం విజయవంతం జగిత్యాల జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2026 బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2026 బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు.మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు.అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదన్నారు. వాహన పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్ సేఫ్టీ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది
హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో అధికారులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు
ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూబి.ఎస్.లత,జిల్లా అధికారులు, రవాణా శాఖ, పోలీస్, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ స్థాయిల అధికారులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *