సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 09, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ సంజయ్ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించి 12వ వార్డు ప్రజలు ఆదరిస్తే ప్రజలకు సేవచేస్తానని స్వప్న కాలనీకి చెందిన సీనియర్ ప్రైవేట్ ఉపాధ్యాయులు, సామాజిక సేవకులు కాసర్ల మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. 12వ వార్డు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్న నేను ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పాఠశాలలో పిల్లల్ని తీర్చి దిద్దిన అనుభవంతో పదవి కోసం కాకుండా, ప్రజా సేవలో కొనసాగాలన్న లక్ష్యంతో ముందుకు వస్తున్న తనను 12వ వార్డు కు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఆదరించి ప్రోత్సహించి,ఆదరించాలని మధుసూదన్ రెడ్డి కోరారు. గతంలో తాను సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని తనకు తోచిన సహాయాన్ని ప్రజలకి చేశానని,12వ వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డులో కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు.