మహిళ నుంచి 5 లక్షల విలువైన హారం చోరీ-

*పోలీసులకు ఫిర్యాదు- బృందాలుగా దిగిన కొత్తకోట ఎస్సై శ్రీనివాస్ టీం *దొంగను పట్టించడం లో కీలకంగా ఏఎన్పిఆర్ కెమెరా-సి *ఐ,ఎస్ ఐ ల ను అభినందించిన జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం :గంపవాని పాలెం గ్రామానికి చెందిన పైల వెంకటలక్ష్మి అనే మహిళ బ్యాగులో ఉంచిన ఐదు లక్షల విలువైన బంగారు హారాన్ని గుర్తు తెలియని వ్యక్తి చాకచక్యంగా ఆమె బ్యాగ్ కత్తిరించి దొంగలించాడు. ఈనెల ఐదున ఆమె నర్సీపట్నంలోని బ్యాంకులో ఆ నగను విడిపించి తీసుకు వస్తుండగా ఆటో లో ఒక అనుమానత వ్యక్తి ఎక్కి ఆమె బ్యాగను కత్తిరించి నగని కాజేశాడు. దీంతో ఆమె కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా కొత్తకోట ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నర్సీపట్నం నుంచి కొత్తకోట వచ్చే మార్గంలో ఉన్న సీసీ కెమెరాలు, ఇతర సాంకేత పరికరాలను ఉపయోగించి కేసును సత్వరం పూర్తి చేసి చోరీ సొత్తు తో పాటు దొంగను తక్షణం పట్టుకోమని జిల్లా ఎస్పీ అదేశాలివ్వడంతో కొత్తకోట ఎస్సై,సిబ్బంది పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ప్రారంభించారు. ఆ మహిళ ఆటో ఎక్కిన సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో ఆ ఆటోను ఎక్కేవారు దిగేవారి కదలికలను సీసీ కెమెరాలు ద్వారా నిశితంగా పరిశీలిం చారు. ఒక అనుమానత వ్యక్తి బొడ్డేపల్లిలో ఆటో ఎక్కి చెట్టుబిల్లి లో దిగిపోవడాన్ని గమనించారు. బొడ్డేపల్లిలో ఆటో ఎక్కిన సదరు వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడెక్కడ తిరిగింది కెమెరాలు ద్వారా గమనించారు.ఆ వ్యక్తి ఒక బైక్ పై వచ్చినట్టు గమనించారు. ఆ బైక్ నెంబర్ను పరిశీలించి విచారణ చేశారు. దీంతో చోరీ చేసిన దొంగ పట్టుబడ్డాడు. అతనిని పూర్తిగా విచారణ చేయగా ఏ విధంగా దొంగతనం చేసింది అన్ని ఒప్పుకోవడంతో అతనిని అతనితోపాటు మరొక వ్యక్తిని అరెస్టు చేశామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు . అలాగే నిందితుడు ఉపయోగించిన బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదైన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో విచారణ చేసి సోత్తు స్వాధీనం చేసుకుని మంచి ప్రతిభ కనబరిచిన ఎస్ఐ శ్రీనివాసును, సిబ్బందిని వారికి తగిన సలహాలు అందించిన సిఐ కోటేశ్వరరావును అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా ఎంతగానో అభినందించారు. సిసి కెమెరాలు వల్ల ఎటువంటి నేరస్తులను గాని ప్రమాదాలను గాని ఎంత సునాయాసం గా పట్టుకోవచ్చు నో ఇట్టే తెలియజేస్తాయని, వాటి అవసరాన్ని ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు..శేషు రావికమతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *