సాక్షి డిజిటల్ న్యూస్, మరికల్,జనవరి o9, 2026,( గాజుల ఇమామ్ ), మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం సీఎం కప్పు క్రీడల ర్యాలీ కార్యక్రమాన్ని మరికల్ పట్టణంలోని వివిధ వార్డులలో నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో మరికల్ మండల ఎంఈఓ మహమ్మద్ కరిముల్లా, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. సూర్య మోహన్ రెడ్డి, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న, మరికల్ ఎస్సై రాములు, మరికల్ గ్రామ సర్పంచ్ గుప చెన్నయ్య, ఉప సర్పంచ్ కటికే కాజా, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు మరికల్ గ్రామ అధ్యక్షులు హరీష్ కుమార్, రామకృష్ణారెడ్డి, ఎల్. రాములు,నాగరాజు, గోవర్ధన్, బొంత మొగులయ్య, పెంట మీద రఘు,మరికల్ గ్రామంలోని వివిధ వార్డు సభ్యులు సభ్యులు, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
