సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి.9, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. ములకలచెరువు సర్కిల్ పరిధిలోని పెద్దతిప్పసముద్రం పోలీస్ స్టేషన్ ను గురువారం మదనపల్లె డిఎస్పి ఎస్ మహేంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఆయన పెద్దతిప్పసముద్రం పోలీస్ స్టేషన్ క్రైమ్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మండలంలో అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెంచి, పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో జూదాలు, కోడి పందాలు,పై ఉక్కు పాదం మోపాలన్నారు. మహిళా సంరక్షణ, డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత యాప్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మారుమూల గ్రామాలలో జరిగే అసాంఘిక కార్యక్రమాలు స్థానిక మహిళా పోలీసుల సహకారంతో అరికట్టడానికి కృషి చేయాలన్నారు డీఎస్పీ వెంట ఎస్సై పరమేష్ నాయక్ మరియు సిబ్బంది ఉన్నారు.