సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 9 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాట్టాదారు పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమం రోలుగుంట మండలం శివారు మోకాస కొత్తపట్నం పంచాయతి పెదపెటలో గురువారం రెవిన్యూ సిబ్బంది రీ సర్వే డి టి కె చిన్నయ్య పడల్ వీర్వో రాజులమ్మ టీడీపీ సీనియర్ నాయకుడు మడ్డు పైడి తల్లి నాయుడు వైసీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బి సతీష్ చేతులు మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన రీ సర్వే ప్రకారం మోకాస కొత్తపట్నం పెదపెట రెవిన్యూలో సుమారు 129 పట్టాదారు పాస్ బుక్స్ వచ్చాయని తెలిపారు. ఇందులో అర్హులైన 120 మందికి లబ్ధిదారులకు పంపిణీ చేశామని అన్నారు.మిగితా 9 మందికి త్వరలో పట్టాదారు పాస్ బుక్స్ అందజేస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మడ్డు పైడి తల్లి నాయుడు,ఎం కె పట్నం బూత్ నెం 2 బూత్ కన్వీనర్ పాగి పోతునాయుడు,స్థానిక సర్పంచ్ బర్సింగి నూకాలమ్మ తనయుడు వైసీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బర్సింగి సతీష్,స్థానిక టీడీపీ నాయకులు పాగి నరసింహమూర్తి,కొదమ నారాయణ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.