సాక్షి డిజిటల్ న్యూస్ 9 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, జగిత్యాల కండ్లపల్లి చెరువు మత్తడి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని నీరు హృద అవుతుంది రైతులం అందరం నష్టపోతాం అని జీవన్ రెడ్డి కి తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ కండ్లపల్లి చెరువు క్రింద 100ల ఎకరాల భూమిలో రైతులు పంట నారు వేసుకున్నారు గుర్తు తెలియని వ్యక్తులు చెరువు మత్తడిని బ్రీచ్ చేశారు వారి పైన చర్యలు తీసుకోవాలని సూచించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఒక వేళ ఇరిగేషన్ సిబ్బంది మరమ్మతుల కోసం చేసిన రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వనిది క్రాప్ హాలిడే ప్రకటించనిది ఎలా చేస్తారు అని అడిగారు రైతులు నారు పోసుకున్నారు వారు పంట నష్టపోకుండా వెంటనే మత్తడి పున నిర్మాణం చేయించాలి మత్తడి మరమ్మతులు ప్రధానం కానీ రైతులకు ముందస్తు సమాచారం తెలపకుండా చేయవద్దు అని అన్నారు మార్చి నెలలో పొలాలు అయిపోయిన తర్వాత చేయాలని క్రాప్ హాలిడే ప్రకటించ నిది మరమ్మతులు చేస్తే రైతులు నష్టపోతారు అని అధికారులకు సూచించారు వెంటనే మత్తడి పూడ్చాలని అధికారులకు సూచించారు.