సాక్షి డిజిటల్ న్యూస్ 09 జనవరి : – వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి : – మండల పరిధిలోని ముద్దాపురం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామంలో ఉన్న చెత్త గ్రామ సర్పంచ్ సామ సరస్వతి రాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందితో గురువారం రోజున గ్రామంలోనీ పలు కాలనీలలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు చెత్తను గ్రామపంచాయతీకి సంబంధించిన వాహనంలో వేయాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలు గ్రామ పరిశుభ్రత లో భాగంగా నూతన పాలకవర్గానికి ప్రజలు సహకరించాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే గ్రామం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బడక శ్రీనివాస్, సెక్రెటరీ లాలయ్య గూడూరు సుగుణమ్మ యాదిరెడ్డి ,వాకిటి మంజుల , మచ్చేందర్ రెడ్డి, శ్యామల చైతన్య నాగిరెడ్డి, సోలిపురం బుచ్చిరెడ్డి, సామరాజేందర్ రెడ్డి బత్తుల బిక్షపతి, వాకిటి కొండల్ రెడ్డి, నర్సిరెడ్డి , గ్రామపంచాయతీ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.