సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 09/2026, మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్, గుడి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కి ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అభయాంజనేయ స్వామి చిత్రపటాన్ని కేటీఆర్ కి ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఉప్పల్ నియోజకవర్గంలోని అభయాంజనేయ స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉందని, భక్తిభావం ఉట్టిపడేలా ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. త్వరలోనే ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తో కలిసి చిలకనగర్ గుట్టపై కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి వారిని స్వయంగా దర్శించుకుంటానని కేటీఆర్ మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈరెల్లి రవీందర్ రెడ్డి, కొంపల్లి రాజ్ కుమార్, శనిగరం తిరుమలేష్, ఫోటోల రాజు, అధిక సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
