సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 09, రామకృష్ణాపూర్: గాంధారి మైసమ్మ జాతర జరిగే ప్రదేశంలో భక్తులకు సరైన సౌకర్యాలు ఏర్పాటుచేందుకు కృషి చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దేవదాయ శాఖ అధికారి రంగు రవి తెలిపారు. గురువారం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయాన్ని సందర్శించి మైసమ్మ తల్లిని రంగు రవి దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడారు. దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు మైసమ్మ ఆలయాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించడం జరిగిందని భక్తులు ఎంతో నమ్మకంగా సంవత్సరకాలం అమ్మవారిని దర్శించుకుంటారని భక్తులకు సరైన వసతులు లేవని కమిటీ సభ్యులు తెలిపారని అన్నారు. ఆలయం చుట్టూ భక్తులకు పార్కింగ్ సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. సమస్యలన్నీ దేవాదాయ శాఖ అధికారులకు తెలిపి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో బొక్కలగుట్ట గ్రామ సర్పంచ్ మాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పదవ వార్డు మాజీ కౌన్సిలర్ పనాసరాజు, గోపూ రాజం, రవీందర్, పూజారులు పాల్గొన్నారు.