సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కా నాగేశ్వరరావు జనవరి 9 2026 నందిగామ సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాలు (Cock Fights) నివారణకు నందిగామ డివిజన్ లెవెల్ సమావేశం నిర్వహించిన నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ కే. బాలకృష్ణ ఆర్డీవో మాట్లాడుతూ, కోడి పందాలు జంతు క్రూరత్వ నిరోధక చట్టానికి విరుద్ధమని, అలాగే న్యాయస్థానాల ఆదేశాలకు విరుద్ధంగా జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ స్థాయిలో ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ మరియు పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేసి, కోడి పందాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. డివిజన్ స్థాయి సమన్వయ సమావేశంలో, ఏసీపీ నందిగామ ఏబిజి తిలక్ , మున్సిపల్ కమిషనర్ లోవరాజు , డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) జాన్ వేస్లీ , తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.