సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 09: రిపోర్టర్ తిరుపతి, గురువారం కుకునూరు పల్లి మండల తహసిల్దార్ కార్యాలయం జిల్లా కలెక్టర్ కె హైమావతి సందర్శించి మండలంలోని ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎలెక్టోరల్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చెయ్యాలి. మండలంలోని అన్ని గ్రామాల్లో సూపర్ వైజర్ లు, బిఎల్ఓ లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలని తెలిపారు. రోజు చేసిన మ్యాపింగ్ వివరాలు కంప్యూటర్ లో అప్లోడ్ చేసే ప్రక్రియను పరిశీలించారు.