సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 9, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య : మల్లాపూర్ మండలం రాఘవపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తో పాటు మల్లాపూర్‌లోని జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. జూనియర్ కళాశాల విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసి, ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించాలని ప్రోత్సహించారు.అలాగే, రోజువారీ అధ్యయన ప్రణాళిక పాటించాలని మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని లక్ష్య నిర్ధారణతో ముందుకు సాగాలని ఉపాధ్యాయుల సూచనలు తప్పక పాటించాలని సూచించారు.విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది అని, మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.