ఆరె కులస్తులు రాజకీయంగా ఎదగాలి

*సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి:09, వేములవాడ ఆర్. సి. ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్.. ఆరె కులస్తులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని అరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరె, ఆర్య క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిలువేని మల్లేశం ఆధ్వర్యంలో జిల్లాలోని పలు గ్రామా ఆరె, ఆర్య క్షత్రియ కులానికి చెందిన వారు సర్పంచులు, ఉప సర్పంచులుగా ఎన్నికైన సందర్భంగా వేములవాడ పట్టణంలోని హరిమల గార్డెన్ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల కు పైగా జనాభా కలిగి ఉండగా 8 నుండి 10 నియోజకవర్గాల్లో గెలుపును నిర్దేశించే విధమైన ఓటర్లు కలిగి ఉన్నామని చెప్పారు. గ్రామపంచాయతీ నుండి జరిగే ప్రతి ఏ ఎన్నికైన ప్రతి ఒక్కరు పోటీలో నిలుచుని రాజకీయంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. జనాభా ప్రతిపాదికన మనకు రావలసిన ప్రతి హక్కును ప్రభుత్వం ద్వారా రాబట్టుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామాల సర్పంచులు ఇటిక్యాల రాజు, ఎండ్రాల ప్రసాద్, సాండేసారి సౌజన్య -మల్లికార్జున్, కౌడేగానీ వెంకటేష్, ఇరువల సౌందర్య మహేందర్, మోహన్ రావు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి 42 మందిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షుడు సిలువేరి మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఎండ్రాల అశోక్, ఉపాధ్యక్షులు సూరదేవరావు, రాష్ట్ర నాయకులు సూరారం శివాజీ, జెండా రాజేష్, మనోహర్, ఇటికాల లింగయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *