సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 9, డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు కాట్రేనికోన మండలం పల్లం గ్రామం మత్స్యకారులతో నాయకులతో సమావేశం అయి వారి సమస్యలు తెలుసుకొని మత్స్యకార సమస్యలు తీర్చే విధంగ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తద్వారా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు అన్ని పరిష్కరిస్తామని అలాగే ఆదరణ-3 పథకం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని ఉపయోగించుకుని మత్స్యకారులు ఆర్థికంగా స్థిరపడాలని కోరారు అలాగే ఇక్కడ గ్రామస్తులు కమ్యూనిటీ హాల్, వలలు, జెట్టి నిర్మాణం, నెట్ మేకింగ్ సెంటర్, అలాగే బోటు రిజిస్ట్రేషన్లు చేయించాలని కోరారు, ఇంటర్మీడియట్ వరుకు గురుకుల పాఠశాల కట్టించాలని కోరారు. పల్లం గ్రామం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరిస్తారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్, స్టేట్ సెక్రటరీ నాగిడి నాగేశ్వరావు , ఇల్లింగి వెంకట రమణ, పార్టీ ప్రెసిడెంట్ మల్లాడి రామకృష్ణ, దండుప్రోలు సత్యం, దండుప్రోలు బాలయ్య, గ్రామ పెద్ద బొమ్మిడి లింగేశ్వరరావు, సంఘాని వెంకటేశ్వర్లు, పెమ్మాడి వెంకటేశ్వరరావు మల్లాడి గోవిందు ఓలేటి శ్రీను, పెమ్మడి శ్రీను మల్లాడి శాసయ్య, గ్రామ పెద్ద అవనిగడ్డ దాసు, ఆకుల రాంబాబు, పాలెపు మహేష్, పాలెపు శ్రీరాములు, కప్పడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
