సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 9 మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో సింగరేణి పై జరిగిన చర్చల్లో భాగంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులు తమ అమూల్యమైన జీవితాన్ని పణంగా పెట్టి అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉద్యోగుల జీవన ప్రమాణాలు అత్యంత దయా నియంగా మారి నిర్జీవంగా నిలయడం సింగరేణి సమాజానికి అత్యంత బాధాకరం దయానియం మనీ శాసనసభలో సాంబశివరావు మాట్లాడిన అంశం ముఖ్యమంత్రి నుంచి ఉపముఖ్యమంత్రి వరకు శాసన సభ్యులను దిగ్భ్రాంతి గురి చేయడం జీవన మానవీయ విలువలను తట్టి లేపి విధంగా సాంబశివరావు ఉపన్యాసం రాష్ట్ర స్థాయిలోనూ శాసనసభ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తున్న యావత్ సింగరేణి క్షేత్రస్థాయి ప్రజానీకాన్ని హృదయాన్ని తట్టి లేపింది 40 సంవత్సరాలు ఉద్యోగం నిర్వహించి. అంతిమ దశలో విరామం పొందే సమయంలో సొంత నివాసం లేక కుటుంబ సభ్యులు చీదరించుకునే విధంగా మారిన సింగరేణి ఉద్యోగి జీవన విధానం అత్యంత దయనీయం వారికి సింగరేణిలో ఖాళీగా ఉన్న కోటర్స్ ను కేటాయించాలని సిపిఆర్ఎంఎస్ భార్యా భర్తలకు 15 లక్షల వరకు పెంచాలని బొగ్గు గనుల వేలం పాటలలో జెన్కోకు కాకుండా సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.