సాక్షి డిజిటల్ న్యూస్: 09 జనవరి, పాల్వంచ.రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగ యువత కోసం ఆర్ఎఎన్, ఎంఆర్ఎఫ్ సంస్థల్లో 120 అప్రెంటిస్, ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్ లేదా ఐటీఐ ఉత్తీర్ణులై, 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు అర్హులు. ఈ నెల 10వ తేదీన (శనివారం) ఉదయం 10 గంటలకు పాల్వంచలోని కలెక్టర్ కార్యాలయం నందు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.