AUTUMN MEADOW కంపెనీ MD దేశం వదిలి మలేషియాకు మకాం మార్చబోతున్నాడా…..?

*వార్తా పత్రికలలో వచ్చే వార్తా కథనాల ద్వారా వాస్తవాలు గ్రహించిన ఇన్వెస్టర్లలో మొదలైన భయాందోళనలు. *ఇంటర్నేషనల్ కంపెనీ అని నమ్మించి, మోసం చేసి తమ చేత ఇన్వెస్ట్మెంట్ చేయించారని లబో దిబో మంటున్న ఇన్వెస్టర్లు. *ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయంతో బ్రతుకుతున్న AUTUMN MEADOW ఇన్వెస్టర్లు. *పూరిస్తాయి ప్రభుత్వ అనుమతులతో నడుపుతున్న కంపెనీ అని అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని మోసం చేసిన AUTUMN MEADOW మేనేజింగ్ డైరెక్టర్. *కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మనీతో మలేషియాకు మకాం మార్చబోతున్నాడా? అనే వార్త బలంగా వినిపిస్తుండడంతో రాష్ట్రంలోని పెట్టుబడిదారుల్లో మొదలైన ప్రకంపనలు.

సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 6, (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్: షేక్ మక్బూల్ బాష).
అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అడ్వొకేట్ గా చలామణి అవుతూ, ఇటు నల్లకోటు నీడలో చట్టవిరుద్ధమైన తన వ్యాపార సంస్థకు న్యాయవ్యవస్థను పెట్టుబడిగా పెట్టి, అమాయక ప్రజల అత్యాశ అనే బలహీనతను పసిగట్టి, Autumn Meadow అనే తన ఇల్లీగల్ వ్యాపారానికి శ్రీకారం చుట్టి, ప్రజల సొమ్ముతో అనతికాలంలోనే కోట్ల రూపాయలకు పడగలెత్తిన రికార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అడ్వొకేట్ కే చెందుతుంది అని అనడంలో సందేహం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తన స్వగ్రామమైన మార్కాపురం జిల్లా “గురిజేపల్లి” గ్రామాన్నే Autumn Meadow కంపెనీకి వేదికగా మలిచి, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ అని తన ఇల్లీగల్ టీంతో మోసపూరితమైన ప్రచారం చేయించి, అమాయకుల చేత పెట్టుబడులు పెట్టించడంలో ఇతను అందే వేసిన చెయ్యి అని చెప్పుకోవచ్చు. మలేషియా దేశంతో సత్సంబంధాలు కలిగివున్న ఇతను, పెట్టుబడి పెట్టించిన కోట్లరూపాయలను మలేషియా దేశంకు హవాలా రూపంలో చేరవేస్తున్నాడనే వార్త ప్రజల్లో బలమైన చర్చాంశ నీయంగా మారింది. అసలు ఇతను వచ్చిన కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ ప్రభుత్వ అనుమతి లేని ఇతని సంస్థలో ఎలా పెడుతున్నాడు, లావాదేవీలు ఎలా నడుపుతున్నాడనేదే ప్రజలకు ప్రశ్నార్ధకంగా మారింది. అసలు ఇప్పటివరకు ఇన్వెస్టర్లకు సైతం తన కంపెనీకి సంబంధించి భారత ప్రభుత్వo నుండి అనుమతి పొందిన అధికారిక ధృవపత్రాలు చూపించకపోవడంతో ఇన్వెస్టర్లలో అనుమానాలు మొదలయినాయి. అసలు ఇతనికి మలేషియా దేశానికి మధ్య ఉన్న రహస్య వ్యాపారసంబంధాలు ఏంటని ప్రజలు ప్రశ్నించుకుంటు న్నారు. ఇతనిని, ఇతని కంపెనీకి సంబంధించి ప్రశ్నించిన జర్నలిస్టులను బెదిరించడం, అడ్డుపడుతున్న అధికారులను డబ్బుతో కొనడం ఇతని ఇల్లీగల్ దందా అభివృద్ధికి ఇతను ఎంచుకున్న మార్గం అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక బండికి లైసెన్స్ డాక్యూమెంట్స్ లేకపోతేనే బండిని సీజ్ చేసి స్టేషన్లో పెట్టే పోలీసు అధికారులు, ప్రభుత్వ అనుమతి లేని ఇల్లీగల్ సంస్థలో జనాల చేత కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిస్తున్న ఇతనిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రజలు పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇతని ఇల్లీగల్ దందా గురించి పలుమార్లు వార్తా పత్రికలలో వచ్చినప్పటికీ, ఇతని మీద, ఇతను నడుపుతున్న అనధికార పెట్టుబడి సంస్థ మీద కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇతని మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు పోలీసు అధికారులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఇతను ఒక న్యాయవాది అయి ఉండి కూడా ఇటువంటి ఇల్లీగల్ వ్యాపారాన్ని నడిపిస్తున్న ఇతను న్యాయవ్యవస్థకే కళంకం అని, ఇతనిని వెంటనే న్యాయవృత్తి నుండి తొలిగించాలని “బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” వారిని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ మీద “సైబర్ క్రైమ్” డిపార్ట్మెంట్ వారు విచారణ చేపట్టారని విశ్వసనీయ వర్గాలనుండి సమాచారం ఉందని, ఒకవేళ ఇందులో ఎవరైనా పెట్టుబడులు పెట్టివుంటే తక్షణమే తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.ఇక ఈ అడ్వొకేట్ నడుపుతున్న కంపెనీ విషయానికొస్తే, Autumn Meadow లేదా autumnmeadow.in అనే వెబ్‌సైట్ ఒక ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ సర్వీస్ ప్లాట్‌ఫాం కాదు అని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి భారత ప్రభుత్వం లేదా SEBI (Securities and Exchange Board of India) వంటి ఏ అధికారిక సంస్థ వద్ద నమోదు, లైసెన్స్, SEBI రిజిస్ట్రేషన్ అనేవి లేవు. వెబ్‌సైట్ ఏ కంపెనీగా MCA (Ministry of Corporate Affairs) వద్ద నమోదయ్యింది అనే అధికారిక CIN, పన్ను, రిజిస్ట్రేషన్ సమాచారం కూడా లేదు.అసలు సైట్ ద్వారా నమోదుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని అందుబాటులో పెట్టకుండా ఇల్లీగల్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. Autumn Meadow వారి వెబ్‌సైట్‌లో “నేను చట్టా పాలనలో పనిచేస్తున్నాం” అన్న మాట ఉన్నా, అలాగే వారి About మరియు Privacy policy పేజీల్లో కంపెనీ చట్టబద్ధంగా పని చేస్తుందని చెబుతున్నారు, కానీ అది వారికి వారే స్వయంగా వ్రాసుకున్న సమాచారం మాత్రమే. కంపెనీ రిజిస్ట్రేషన్, SEBI రిజిస్ట్రేషన్, కాన్సాలిడేటెడ్ రిపోర్ట్ లేని పటిష్ఠ ఆధారం లేదు.ఈ కంపెనీకి అధికారిక CIN లేదా నంబర్ లేదు, అంటే SEBI ద్వారా నమోదైన ఫైనాన్షియల్, ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ కాదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది.RBI, SEBI, IRDA వంటి లైసెన్సింగ్ అథారిటీ దగ్గర తెలిపిన లైసెన్స్, మరియు పర్మిట్ లేదు. భారతదేశంలోని కంపెనీ రిజిస్ట్రార్ (MCA)లో Autumn Meadow అనే పేరు మనకు ఎక్కడా కనిపించదు.అంటే ఈ సంస్థకు ఆధికారిక లైసెన్స్ లేదు. autumn meadow.in కి భారత ప్రభుత్వ SEBI, కంపెనీ రిజిస్ట్రార్‌లో అధికారిక లైసెన్స్ లేదా చట్టపరమైన నమోదు ప్రూఫ్ లేదు.దీన్ని ఒక ఆధికారిక investment company గా చూడవద్దని నిపుణులు చెబుతున్నారు.అంటే ఇది అధికారికంగా రిజిస్టర్ అయిన ఫైనాన్షియల్ కంపెనీ కాదు అని మనకు అర్ధమవుతుంది.కనీసం SEBI, RBI అధికారులు అందించిన అనుమతులు కానీ, అధికారికంగా “భారత ప్రభుత్వ అనుమతులతో పనిచేస్తున్నాం” అని నిర్ధారించే డాక్యుమెంట్లు గాని లేవు. Autumn Meadow ఒక అధికారికంగా లైసెన్స్ పొందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అని నిర్ధారించే ఆధారాలు లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *