వెల్లంకిలో లైబ్రరీని సందర్శించిన స్కూల్ విద్యార్థులు

సాక్షి డిజిటల్ న్యూస్ 6 జనవరి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కూరెళ్ల విఠలాచార్య ఏర్పాటు చేసిన లైబ్రరీని భూదాన్ పోచంపల్లి మండలంకి చెందిన లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సోమవారం సందర్శించారు. వెల్లంకి గ్రామానికి చెందిన కర్నాటి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కర్నాటి శ్రవణ్ కుమార్ విఠలాచార్యను శాలువాతో సన్మానించి గ్రంథాలయం కోసం పుస్తకాలను, వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగ విఠలాచార్య మాట్లాడుతూ గ్రంధాలయాలు, విద్యాలయాలు విజ్ఞాన భాండాగారాలని పుస్తకాలు ఉన్నచోట న దేవతలు ఉంటారని, నా వద్ద విద్యాభ్యాసం చేసిన పలువురు అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో రాణిస్తున్నారని అందులో తమ గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు పోచంపల్లిలో లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించడం అభినందనీయమని, ఇలాంటి మరెన్నో స్కూలు ఏర్పాటు చేసి తమ గ్రామానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నాటి ఎడ్యుకేషన్ సొసైటీ ఉపాధ్యక్షులు కర్నాటి మహదేవ్, కర్నాటి నరసింహ,గంజి భాస్కర్, లైబ్రేరియన్ తాటిపాముల స్వామి, వనం శిరీష, స్కూలు ప్రిన్సిపాల్ కాశీనాథ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *