సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు జనవరి 6. చోడవరం , రాయపురాజుపేట గ్రామంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్ జీ–రాం జీ కార్యక్రమం గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. కార్యక్రమం లక్ష్యాలు, ప్రయోజనాలు, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలను సభలో వివరించారు. ఈ గ్రామ సభను గ్రామ సర్పంచ్ రామునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఈ సురేష్ కుమార్, ఏఈ ఉదయ్ కుమార్, గ్రామ కార్యదర్శి మోహన్, ఉప సర్పంచ్ రామూర్తి పాల్గొని మాట్లాడారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.ఈ సభకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమంపై ఆసక్తి కనబరిచారు.
