రామ కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభం నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా బాబు వ్యూహం

*ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 6 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు రామకుప్పంలో సోమవారం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు ముఖ్యంగా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించి నిరుద్యోగ నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది త్వరలో ఎయిర్పోర్ట్ మరియు పరిశ్రమల స్థాపనతో ప్రత్యక్షంగా 20000 పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధం చేశారు ఇందులో భాగంగా పి4 కార్యక్రమంలో వారి కుటుంబాలను బాగు చేసి ఆదుకునే దిశగా చెరులు చేపట్టారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులు 45 రోజులపాటు శిక్షణ పొందిన అనంతరం వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పొంది అనంతరం కుప్పంలో ఏడాదిలో ప్రారంభం కానున్న వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు ముందస్తు జాగ్రత్తగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చదువుకున్న యువతీ యువకులు వారి నైపుణ్యాన్ని బట్టి శిక్షణ ఇవ్వనున్నారు శిక్షణ పొందిన తర్వాత సర్టిఫికెట్లు కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు పొంది వారి భవిష్యత్తును మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టారు కుప్పం నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే దిశగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం ప్రాంత యువతీ యువకులను ఆదుకునేందుకు చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిరుద్యోగ బ్రతుకుల్లో వెలుగు నింపును ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకు కుప్పం ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ఎల్లవేళలా రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభ కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబరు శాంతారామ్ ఎంపీడీవో లక్ష్మీకాంత్ కాడ కార్యనిర్వాహక డైరెక్టర్ రఘు రెస్కో వైస్ చైర్మన్ విశ్వనాథ్ మండల దేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వెంకటరమణ కామరాజు నాయక్ మాజీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి l క్లస్టర్ ఇంచార్జీలు రవి నారాయణరెడ్డి నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *