సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 6, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండల కేంద్రంలోని రామడుగు, సితాయిపేట్ గ్రామ సర్పంచులు రమేష్, సిహెచ్ భూమేష్, ఉపసర్పంచ్ చంద్రకాంత్ సోమవారం ఎంపీడీవో లక్ష్మారెడ్డి ఎంపీ ఓ రాజేష్ లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు, అనంతరం గ్రామాల్లో చేపట్టిన పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు, వారు సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్, రాజ్ పాల్ రెడ్డి, సభావాత్ శీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.
