టిఎస్జేయూ సభ్యులకు సభ్యత్వ కార్డులను అందించిన జిల్లా అధ్యక్షుడు డా. పేట భాస్కర్

సాక్షి డిజిటల్ న్యూస్ 6 జనవరి 2026 ( షేక్ అజ్మత్ అలీ రిపోర్టార్) తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ కోరుట్ల నియోజకవర్గం సభ్యులకు నూతన సభ్యత్వ కార్డులను ఈమధ్యనే కొందరికి జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ అందించగా మిగిలిన వాటిని జగిత్యాల జిల్లా టిఎస్జేయూ అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ అందజేశారు. సోమవారం మెట్ పల్లి టిఎస్జేయూ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ జర్నలిస్ట్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టిఎస్జేయూ రాష్ట్ర కమిటీ నిరంతరం పనిచేస్తుందని వారి ఆదేశాల మేరకు జిల్లాలో పాత్రికేయుల పక్షాన ఉద్యమిస్తామని అక్రెడిటేషన్ విషయంలో ప్రభుత్వం అందరికి ప్రాధాన్యత కల్పించాలని ఈసందర్భంగా ప్రభుత్వాన్ని పేట భాస్కర్ కోరారు ఈకార్యక్రమంలో టిఎస్జేయూ జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి మల్లారెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గట్ల శ్రీనివాస్ కో కన్వీనర్లు బెజ్జారపు వినోద్, ఫిరోజ్ ఖాన్, గంగాధర్ నాయకులు నాంపల్లి సంజయ్, దికొండ మురళి, రమేష్, రవిరాజ్, షేక్ అజ్మత్ అలీ, గాజుల శ్రీనివాస్ గౌడ్, ఆకుల రాజు గౌడ్, బొమ్మేన శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *