జోరుగా బేగంపేట్ సర్కిల్ రాంగోపాల్ పేట్ లో అక్రమ నిర్మాణాలు, పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారులు

సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 6 – సికింద్రాబాద్- రాంగోపాల్ పేట్ , జీరా హైదర్ బస్తి రోడ్డు పక్కన అక్రమ నిర్మాణం జరుగుతుంది రెసిడెన్షియల్ పర్పస్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ గా అక్రమ కట్టడం జరుగుతుంది .ఇలా నిర్మాణదారులు విచ్చలవిడిగా నిర్మాణాలు కొన సాగిస్తున్నారు. కేవలం రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకొని ఆపై మరో 2,3 అంతస్తులు నిర్మిస్తున్నారు. బేగంపేట్ సర్కిల్ జిహెచ్ఎంసి అధికారులు ఈ అక్రమ నిర్మాణం ఎందుకు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారో ప్రజలకు అర్థం అవడం లేదు. పత్రికలో ఎన్ని కథనాలు వచ్చిన చూసి చూడనట్టు వదిలేస్తున్న జిహెచ్ఎంసి అధికారుల తీరుపై ప్రజలు మండిపడు తున్నారు. కొందరు రాజకీయ నాయకులతో కుమ్మక్కై మరికొందరు డబ్బులు వెదజల్లుతూ ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.ఈ అక్రమ నిర్మాణదారులు పై స్థాయి అధికారుల నుండి చిన్న స్థాయి అధికారులకు ఫోన్లు చేయించి పనులకు అడ్డం పడుతున్నారని తెలిసింది. ఇంత భారీ ఎత్తున నిర్మాణం కొనసాగుతున్న కనీసం టౌన్ ప్లానింగ్ అధికారులు చైర్మన్లు ఏసీబీ మరియు సెక్షన్ ఆఫీసర్ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రధానంగా వినిపిస్తుంది.ఎలాంటి సెట్ బాక్స్ లేకుండా నిర్మాణం చేపట్టారు. దీనివల్ల మునుముందు రానున్న రోజుల్లో ఎన్నో ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. బేగంపేట్ సర్కిల్ లో ఇలాంటి అక్రమ నిర్మాలను ప్రోత్సహిస్తుంది ఎవరు….? పై స్థాయి జిహెచ్ఎంసి అధికారుల, లేక కింది స్థాయి అధికారుల, స్థానిక రాజకీయ నేతల….? భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు సాగుతూ ప్రభుత్వాదాయానికి భారీ మొత్తంలో గండి పడుతున్నా కూడా విజిలెన్స్ శాఖ కూడా వీటిపైన దృష్టి సారించకపోవడం వెనక భారీ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి శాఖకు నెలవారి మామూళ్లు అందుతున్న కారణంగానే.. ఏ శాఖ కూడా ఇలాంటి అవినీతి అధికారులపై స్పందించడం లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం అక్రమ నిర్మాణాలే కాకుండా ఎప్పుడో కట్టిన ఇళ్ళకి కూడా నూతన అనుమతులు విచ్చలవిడిగా ఇస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళు తెరిచి ఇలాంటి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించకుండా వాటిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *