సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 6, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండల కేంద్రంలోని ఇంద్ర నగర్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని గుడి తాండ పాఠశాల ఉపాధ్యాయులు ఈరోజు సర్పంచ్ మలావత్ బాలు నాయక్ ఉపసర్పంచ్ గోవిందును సాలువ కప్పి సన్మానించారు ఉపాధ్యాయులు సర్పంచులకు పాఠశాల యొక్క సమస్యలను వివరించారు సర్పంచ్ తొందర్లోనే పాఠశాల యొక్క సమస్యలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో మానస, తాండవాసులు, రామ్ చందర్ నాయక్, రవి నాయక్, బిల్లా నవీన్, పాఠశాల యజమాన్యం హెడ్మాస్టర్ లక్ష్మి తదితరులు ఉన్నారు.