సాక్షి డిజిటల్ న్యూస్ – జనవరి 3 – సికింద్రాబాద్ – నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ని, అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా నిర్మించేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని బలపరిచే దిశగా నిరంతరం పనిచేస్తానని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా బాధ్యతగా కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి , టీపీసీసీ అధ్యక్షుడికి వివరించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారంపై ముఖ్య నేతలతో సానుకూలంగా చర్చ జరగడం ఈ సమావేశం ప్రత్యేకతగా నిలిచింది.