సింగరాజుపేటలో రీ సర్వే ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీ సర్వే కార్యక్రమం రోలుగుంట మండల పరిధి కొంతలం జగ్గంపేట మొఖాస
కొత్త పట్నం పంచాయతీల్లో నిర్వహించారు.శుక్రవారం మొఖాస కొత్తపట్నం రెవిన్యూ పరిధి శివారు సింగరాజు పేటలో సర్వే నెం 48 నుండి 55 వరకు సింగరాజుపేటలో సుమారు 25 నుండి 30 ఎకరాలు భూమిని సర్వే చెయ్యడం జరుగుతుందని తదుపరి రెండు నెలల పాటు మొఖాస కొత్తపట్నం పరిధిలో జరుగుతాయని మండల సర్వేరు పి శ్రీనివాస్ తెలిపారు.ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగింసుకోవాలనివాళ్ల దగ్గర వున్నా పట్టాదారు పాస్ బుక్స్ రికార్డ్స్ తీసుకోరావాలని అన్నారు.రీ సర్వేలో ఎవ్వరికి ఏ సమస్య వచ్చిన వెంటనే రెవిన్యూ సిబ్బందికి తెలియజేయాలనీ అన్నారు.రీ సర్వేలో గ్రామ ప్రజలు తాగదలు గొడవలు చెయ్యరాదని రెవిన్యూ సిబ్బందికి సహకరించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో వీర్వో రాజులమ్మ, మండల సర్వేరు పి శ్రీనివాస్,టీడీపీ సీనియర్ నాయకులు మడ్డు పైడి తల్లి నాయుడు, రొంగల గంగరాజు, మాకిరెడ్డి శ్రీను, స్థానిక టీడీపీ కార్యకర్తలు ఎం దేముడు,నరసింహ మూర్తి,సచివాలయం సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.