సమస్యల పరిష్కారానికి వినతి పత్రం

సాక్షి డిజిటల్ న్యూస్: నాగర్ కర్నూల్ జిల్లా/ బిజినాపల్లి మండలం: తేదీ: 2 జనవరి (రిపోర్టర్ కొంకాళి మధుసూదన్): బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామంలోని ఐదవ వార్డులో నెలకొన్న సమస్యలపై బేడ (బుడగ) జంగం ,సంఘం. పాలెం ఆధ్వర్యంలో కాలనీలో నెలకొన్న సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, సిసి రోడ్ల సమస్యలను తీర్చాలని మరియు ఐదో వార్డ్ లో ఉన్న అర్హులైన వృద్ధులకు, వితంతులకు మరియు వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయాలని బేడా( బుడగ) జంగం సంఘం, యొక్క అధ్యక్షులు కళ్లెం. వెంకటయ్య మరియు ప్రధాన కార్యదర్శి కడమంచి అశోక్ గ్రామ సర్పంచుకు వినతిపత్రం అందజేయడం జరిగినది.