శ్రీశైల దేవస్థాన శాశ్వత అన్నదాన పథకానికి పల్నాడు వారు కె.శ్రీవినోద్ 2 లక్షల రూపాయలు/- విరాళం

సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి3, నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. భక్తుల సౌకర్యం శ్రీశైల దేవస్థానంలోని అన్నపూర్ణ భవనం నందు అన్నప్రసాద వితరణ కు గాను కె.శ్రీవినోద్, పల్నాడు వారు ఈ శుక్రవారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ2,04,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు పి.దేవికకు అందజేయడం జరిగింది.దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి. అనంతరం దాతలు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.